
బీసీ సంఘం ఉద్యోగ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా మూర్తి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన ఎంవీవీఎస్‌ఎన్ మూర్తిని నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. స్థానిక మొగల్రాజపురం రత్నమాంబ వీధి లోని కుమ్మరి శాలివాహన సంఘం కార్యాలయంలో కేసన శంకరరావు, బీసీ సంక్షేమ సంఘం యువత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరి క్రాంతికుమార్ కలిసి ఎంవీవీఎస్‌ఎన్ మూర్తికి నియామక పత్రాన్ని ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా కేసన శంకరరావు మాట్లాడుతూ జిల్లా అటవీ శాఖ అధికారిగా, కుమ్మరి శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్(ఎంబీసీ) ఆల్ ఇండియా ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి పనిచేశారని వివరించారు. అలాగే 2005 నుంచి 2008 వరకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఉద్యోగుల సంఘా నికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా సేవలు అందించారని చెప్పారు. బీసీల సమస్య పరిష్కారంతోపాటు సమస్యలు, బీసీ సమాజ సాధికారతకు తన వంతు కృషి చేస్తానని ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి పేర్కొన్నారు.