
మొక్కజొన్నకు తీవ్ర నష్టం
జిల్లా వ్యాప్తంగా రబీలో 8,287హెక్టార్లలో మొక్కజొన్న సాగవుతుండగా యాభై శాతానికి పైగా మొక్కజొన్న ఇప్పటికే కోతలు పూర్తయి కల్లాల్లో ఆరబోశారు. మొక్కజొన్నలను ప్రభుత్వం కొనుగోళ్లు చేయకపోవడంతో ప్రయివేటు వ్యాపారులు ఇష్టం వచ్చిన రేట్లకు అడుగుతుండటంతో గిట్టుబాటు కాక రైతులు అమ్మకుండా కల్లాల్లోనే ఉంచారు. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లోని ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. అంతే కాకుండా వివిధ దశల్లో ఉన్న మొక్కజొన్న పైరు నేలవాలి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో మొత్తం 581 హెక్టార్లలో మొక్కజొన్న నేల వాలినట్లు వ్యవసాయశాఖాధికారులు నివేదికలో పేర్కొన్నారు.