అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య
రాయగడ: అప్పుల బాధ తాళలేక ఒక చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని బిసంకటక్ సమితి హజరిడంగ్ గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. హజరిడంగ్ గ్రామంలో నివసిస్తున్న నరసింహ కుసులియా(55) అనే వ్యక్తి చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొద్ది నెలలుగా వ్యాపారంలో తీవ్ర నష్టాలను చవిచూడడంతో గత్యంతరం లేక కొంత మొత్తం అప్పులు చేసి వ్యాపారాన్ని కొనసాగించాడు. అయితే తెచ్చిన అప్పులను సకాలంలో తీర్చలేకపోవడంతో అప్పులు ఇచ్చినవారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో విరక్తి చెందిన నరసింహ జంబుగుడ గ్రామ సమీపంలోని ఒక జీడి తోటలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. అయితే అంతకుముందు తన కొడుకై న లోకేష్‌కు ఫోన్‌చేసి, తను జంబుగుడ వద్దనున్న ఒక జీడితోటలో ఉన్నట్లు చెప్పి అక్కడికి రమ్మన్నాడు. కొద్ది సమయం తర్వాత లోకేష్ జీడి తోటకు వెళ్లి తన తండ్రిని వెదుకుతుండగా ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే అక్కడి వారికి చెప్పాడు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment