హత్య కేసులో నిర్దోషిగా మావో నేత సవ్యసాచి
రాయగడ: మావోయిస్టు నేత సవ్యసాచి పండాను ఒక హత్య కేసుకు సంబంధించి నిర్దోషిగా గుణుపూ ర్ ఏడీజే కోర్టు తీర్పునిచ్చింది. శుక్రవారం ఈ కేసు కు సంబంధించి పూర్తి పోలీసు బందోబస్తు మధ్య సవ్యసాచి పండాను కోర్టులో హాజరుపరిచారు. సాక్షులను విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. 2004 ఆగస్టు 13న చంద్రపూర్ సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తు న్న డాకు మాఝి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ క్రమంలొ మావో నేత సవ్యసాచి పండాను ఈ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. డాకు మాఝి సమితి కార్యకలాపాల ను నిర్వహించి బైకుపై ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ప్రధాన రహదారి వద్ద కొందరు మావోయిస్టులు అతనిపై దాడి చేసి హత్య చేశారు. ఇందులో సవ్యసాచి పండా కీలక పాత్ర పొషించినట్లుగా భావించిన పొలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు రాగా శుక్రవా రం గుణుపూర్ ఏడీజే కోర్టు 18 మంది సాక్షులను విచారించి తీర్పు వెల్లడించిందని పండా తరఫు న్యాయవాది బ్రహ్మానంద పట్నాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment