శనివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2024
● ఇంటింటా వేడుక ● ఎండురి రుచుల ఘుమఘుమలు
● తొలి సంతానానికి మేనమామ కానుకలు
● శ్రీక్షేత్రం, ఏకామ్ర క్షేత్రాల్లో ప్రత్యేక యాత్ర
జగన్నాథుని సేవలో గవర్నర్
రాష్ట్ర గవర్నర్ రఘుబర దాస్ పూరీలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ మందిరం సందర్శించి రత్న వేదికపై కొలువై ఉన్న శ్రీ జగన్నాథుని దర్శించుకున్నారు.
– భువనేశ్వర్
పింఛన్ కోసం మూడు కిలోమీటర్లు!
● ప్రతినెల ఇబ్బంది పడుతున్న వృద్ధురాలు
రాయగడ: ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ కోసం ఆ వృద్ధురాలు ప్రతినెలా మూడు కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. జిల్లాలోని మునిగుడ సమితి ఘుముటిగుడ పంచాయతీ పరిధి జబగుడ గ్రామానికి చెందిన పునాలు వయసు 80 ఏళ్లు. ప్రభుత్వం అందించే మూడు వేల రూపాయల పింఛనే ఆమెకు ఆధారం. అయితే గ్రామంలో పింఛను అందజేసే అవకాశం లేకపోవడంతో మూడు కిలోమీటర్ల దూరంలోని గురుండి పంచాయతీకి అధ్వానంగా ఉన్న రోడ్డుపై నడుకుంటూ వెళ్లి పింఛన్‌ను తీసుకుంటుంది. ఆ మార్గంలో వాహనాలు లేకపోవడంతో కాలినడకనే వెళ్లాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అధికారులు దయతలచి గ్రామంలోనే పింఛన్ డబ్బులను అందించే ఏర్పాటు చేయాలని పునాలు కోరుతున్నారు.
రైతులకు పరిహారం అందించాలి
పర్లాకిమిడి: ఈ ఏడాది ఖరీఫ్ పంట చేతికి వస్తుందని రైతులు సంబర పడుతుండగా కాశీనగర్ సమితిలో ఏనుగులు సంచారం, గుసాని సమితిలో అడవిపందుల స్వైర విహారంతో పంట నష్టాలకు గురిచేస్తున్నాయని గజపతి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ పట్నాయిక్ అన్నారు. కాశీనగర్ సమితిలో గోరిబంద, అల్లడ, గుసాని సమితిలో కత్తలకవిటి, పుడ్డుని, అగరఖండి తదితర గ్రామాల్లో అడవిపందులు రాత్రిళ్లు వరి పంట నాశనం చేస్తున్నాయని అందువల్ల అటవీ శాఖ అధికారులు వన్యప్రాణులను పారద్రోలడానికి తగు చర్యలు చేపట్టాలని లేదా పంటనష్టం రైతులకు అందజేయాలని సూర్యనారాయణ పట్నాయిక్ డిమాండు చేశారు.
తొలి సంతానానికి ప్రథమాష్టమి
పూజ (ఫైల్)
భువనేశ్వర్:
రాష్ట్రంలో ప్రథమాష్టమి వేడుకలకు అంతా సిద్ధమైంది. స్థానిక పంచాంగ గణాంకాల ప్రకారం మార్గశిర మాసం కృష్ణ పక్ష అష్టమి ప్రథమాష్టమిగా ప్రతీతి. ఈ తిథిని సౌభాగిని అష్టమి, కాల భైరవ అష్టమి, పాప నాశిని అష్టమిగా కూడా చెబుతారు. శ్రీక్షేత్రం, ఏకామ్ర క్షేత్రంలో ప్రథమాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇంటింటా వేడుక
ఈ తిథి నాడు కుటుంబంలో తొలి సంతానం ముద్దు, ముచ్చటతో ఆనందోత్సాహాలతో వేడుక చేసుకుంటారు. జ్యేష్ట సంతానం దీర్ఘాయుష్షు కోసం జ్యేష్టా దేవిని పూజిస్తారు. ఈ సందర్భంగా ఆడ, మగ నిమిత్తం లేకుండా తొలి సంతానం ఎవరైనా వారికి కొత్త బట్టలు తొడిగి పీటపై కూర్చోబెట్టి జ్యేష్టా దేవికి దీపారాధన చేసి నుదుట తిలకం దిద్ది శిరసున అక్షతలు జల్లి పెద్దలు ఆశీర్వదిస్తారు.
ఆచారం.. ఆత్మీయం
ప్రథమాష్టమి వేడుక ఆచారం, ఆత్మీయతల మేలి కలయిక. తోబుట్టువుకు తొలి సంతానం కలగడం మేనమామకు ఎనలేని ఆనందం పంచి పెడుతుంది. ఈ మనోభావానికి ప్రతీకగా ఏటా మార్గశిర మాసం అష్టమి నాడు మేనల్లుడు లేదా మేనగోడలకి కొత్త బట్టలు, మిఠాయి కానుకగా సమర్పించడం ఆచారం. ప్రాచీన కాలంలో మార్గ శిరం ఏడాదిలో తొలి మాసం. ఈ మాసంలో తొలి అష్టమి ప్రథమాష్టమిగా ప్రాచుర్యం సాధించడంతో నేటికి ఇదే సంప్రదాయం కొనసాగుతుంది.
ఎండురి పిండి వంటకం
ప్రథమాష్టమి వేడుకలో ఎండురి పిండి వంటకం విభిన్నం. ఏడాదిలో ఒకే ఒకసారి ఈ వంటకం తారసపడుతుంది. మినప రుబ్బులో కొబ్బరి కోరు, బెల్లం, పెసర పప్పు మిశ్రమం పసుపు కొమ్ముల ఆకుల్లో పేర్చి ఆవిరి పట్టించడంతో ఎండురి పిండి వంటకం సిద్ధం అవుతుంది. ఈ వంటకం జ్యేష్టా దేవికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యంగా పరిగణిస్తారు. ప్రథమాష్టమి మినహా ఏడాది పొడవునా ఇతర సందర్భాల్లో ఈ వంటకం జాడ ఉండకపోవడం విభిన్నం. దీంతో పాయసం కూడా ఆరగిస్తారు.
పాత్ర ప్రత్యేకం
ఎండురి ఆవిరి పెట్టేందుకు వినియోగించే పాత్ర ప్రత్యేకం. దీని కోసం కొత్తగా ఒక మట్టి పాత్రని సిద్ధం చేస్తారు. 7 రోజులు ముందుగా దీన్ని సిద్ధం చేసుకుని ఎండురి వంటకం కోసం వినియోగిస్తారు. ఈ వంటకం తయారీ పూర్తి కావడంతో ఈ కుండని పగలగొట్టడం ఆచారం.
ప్రధాన రహదారిపై కొనసాగుతున్న వారపు సంత
రాయగడ: జిల్లాలోని అంబొదల వద్ద ప్రతీ సొమవారం జరిగే వారపు సంతను వేరే ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రధాన రహదారి వద్ద ఏర్పాటు కావడంతో రాకపొకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అందువల్ల దీనిని వేరే ప్రాంతానికి తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రత్యేకంగా వారపు సంత కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని వ్యాపారులు వదిలేసి ప్రధాన రహదారిపై సంతను ఏర్పాటు చేస్తుండడంతో వాహన రాకపొకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే విషయమై పంచాయతీ, సమితి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకపొతుందని ఆవేదన వ్యక్త ం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని వారపు సంతను తన యథాస్థానం వద్ద ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
న్యూస్‌రీల్
శ్రీక్షేత్రంలో ప్రథమాష్టమి
పూరీ శ్రీ జగన్నాథుని సంస్కృతిలో ప్రథమాష్టమి వేడుకగా నిర్వహిస్తారు. స్వామికి మేనమామ దగ్గర నుంచి సంప్రదాయ భారం (కావడి) సంప్రదాయరీతిలో తరలి వస్తుంది. నియాలి ప్రాంతం మొవులా క్షేత్రం నుంచి పూరీ శ్రీ జగన్నాథుడు కొలువు దీరిన శ్రీ మందిరానికి ప్రథమాష్టమి పూజా సామగ్రి చేరుతుంది. సప్తమి నాడు ఒక రోజు ముందుగా ఈ సామగ్రి తరలిస్తారు. వీటిలో పచ్చి బియ్యం, మినుములు, కొబ్బరి, బెల్లం, అరటి పండ్లు, నెయ్యి, చందనపు చెక్క, కర్పూరం, జాజికాయ, తమలపాకులు, వక్క, ఏలకులు, లవంగాలు, గోపాల వల్లభ భోగం కోసం పలు రకాల పండ్లు, కాయలు మరియు భగవంతుని అలంకరణ కోసం పద్మ పూలు ఉంటాయి. మొవులా క్షేత్రం అధిష్టాన దైవం శ్రీ మాధవుడు శ్రీ జగన్నాథుని మేనమామగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ప్రథమాష్టమి పురస్కరించుకుని స్వామి కోసం శ్రీ మందిరానికి ప్రథమాష్టమి సరుకులు చేరుతాయి.
రాకపోకలకు ఇబ్బంది
కేటాయించిన స్థలంలో సంతను
నిర్వహించాలని ప్రజల డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment