రెప్పపాటులో సర్వం దగ్ధం
భువనేశ్వర్:
పూరీ మంగళా ఘాట్ ప్రాంతం సబ్బుల కార్ఖానాలో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కబురు అందడంతో అగ్ని మాపక దళం హుటాహుటిన ఘటనా స్థలం చేరే సరికి సర్వం కాలిపోయింది. ప్రాథమిక విచారణ ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యుట్ సమస్యతో ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. మంటల తీవ్రతతో పైకప్పు, గోడలు కుప్ప కూలాయి. పలువురు కార్మికులు పనిలో మునిగి ఉండగా కార్ఖానాలో ఈ ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు వీరంతా సమయస్ఫూర్తితో బయటకు తరలి రావడంతో ప్రాణాపాయం తప్పింది. కార్ఖానాలో అగ్ని మాపక వ్యవస్థ అందుబాటులో ఉండి ఉంటే ఇంతటి తీవ్ర ప్రమాదానికి అవకాశం లేకపోయేదని అగ్ని మాపక వర్గాల అభిప్రాయం. ఈ మేరకు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment