రైల్వే ఉద్యోగాల పేరిట అక్రమాలు
భువనేశ్వర్: రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తల్లీకొడుకుల ముఠా లక్షలాది రూపాయల మోసానికి పాల్పడింది. వీరిలో కొడుకు పోలీసులకు చిక్కా డు. బాధిత నిరుద్యోగ యువకుని ఫిర్యాదు ఆధారంగా చేపట్టిన విచారణలో నిందితుడు చిక్కాడు. ఈ మేరకు బలమైన సాక్ష్యాధారాలు చేతికి చిక్కా యని పోలీసు వర్గాలు తెలిపాయి. పరారీలో ఉన్న తల్లిని గాలించడంతో ఈ ముఠాలో ఇతర సభ్యుల వివరాల్ని ఆరా తీస్తున్నట్లు విచారణ వర్గం పేర్కొంది. మోసానికి గురై లక్షలాది రూపాయల్ని చేజార్చుకున్న బాధితుడు చిరంజీవి రౌత్ కటక్ బిడానాసి ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇతడు దాఖలు చేసిన వివరాలు ఆధారంగా పోలీసులు నిందిత మోసగాడు డేనియల్ రాజాని అరెస్టు చేశా రు. విచారణ లోతుగా కొనసాగుతుందని తెలిపా రు. ప్రధానంగా నిందితుని తల్లి సమర్పిత చౌదరి పరారీలో ఉంది.
ఆమె కోసం గాలిస్తున్నారు. బాలాసోర్ జిల్లాలో పలువురు నిరుద్యోగ యువతీ యువకుల నుంచి రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలాది రూపాయలు గుంజారు. 2022 సంవత్సరం నుంచి తల్లీకొడుకులు ఈ ఉద్యోగాల అమ్మకాల కార్యకలాపాల్లో తలమునకలై ఉన్నారు. అమాయక యువతిని నమ్మించేందుకు వీలుగా బూటకపు ఉద్యోగ నియామక పత్రాలు, అనుబంధ శిక్షణ వంటి చర్యలతో బురిడీ కొట్టించారు. కాలానుక్రమంగా ఇందంతా బూటకమని మోసపోయామని ఆలస్యంగా గుర్తించిన అమాయక నిరుద్యోగ యువత తమ సొమ్ము ఫిరాయించమని అభ్యర్థించగా ప్రాణాలు తీస్తామని తల్లీకొడుకులు బెదిరించడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. ఉద్యోగ నియామకానికి సంబంధించిన బూటకపు వ్యవహారం సమగ్ర సాక్షాధారాల్ని పోలీసులకు దాఖలు చేశారు. బాలాసోర్ జిల్లాతో పలు ఇతర జిల్లాల నుంచి నిరుద్యోగ యువతకు ఉద్యోగం పేరిట మోసం చేసి సుమారు రూ. 2 కోట్ల వరకు ఆర్జించినట్లు ఆరోపణ. ఈ వ్యవహారంలో డేనియల్ రాజాతో అతని తల్లి సమర్పిత చౌదరితో మరికొంత మంది తెర వెనక ఉన్నట్లు పోలీసు దర్యాప్తు బృందం సందేహిస్తుంది. ఈ కోణంలో ముఠా పూర్వాపరాల గుట్టు రట్టు చేసేందుకు నడుం బిగించింది.
తల్లీకొడుకులే పాత్రధారులు
కొడుకు అరెస్టు
పరారీలో తల్లి
Comments
Please login to add a commentAdd a comment