సెల్ టవర్ ఎక్కి హల్‌చల్
రాయగడ: సెల్ టవర్‌పైకి ఎక్కి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. నాటకీయ పరిణామంగా రెండు గంటల పాటుగా కొనసాగిన ఈ ఘటనలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతనికి నచ్చజెప్పి కిందకి దించారు. జిల్లాలోని చందిలి పోలీస్‌స్టేషన్ పరిధి కొలనార జగన్నాథ మందిరం సమీపంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు తెలియజేశారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం చంపా ప్రాంతానికి చెందిన భీమసేన్ ఠాకూర్ అనే వ్యక్తి బుధవారం జగన్నాథ మందిరం సమీపంలోని సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని అరవడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన అక్కడ ఉన్న కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతనికి నచ్చజెప్పారు. దాదాపు రెండు గంటల సేపు అతడిని ఒప్పించి కిందికి దించారు. అనంతరం చందిలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అసలు ఎందుకు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడో పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment