బీజేపీలో చేరిన న్యాయవాదులు
జయపురం: బీజేడీ పార్టీకి కంచుకోటగా ఉన్న కొరాపుట్ జిల్లాలో ఆ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, మద్దతుదారులు అధికార బీజేపీలో చేరుతున్నారు. జయపురం న్యాయవాదులు 25 మంది మంగళవారం బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో బీజేడీ సీనియర్ నేతలైన న్యాయవారులు గుప్తేశ్వర్ గంతాయిత్, సుధీర్ త్రిపాఠీలతో పాటు లాల్ మోణ మిశ్ర, రాజేంద్రకుమార్ శాంత్ర, నివేదిత రథ్, సస్మిత గంతాయిత్, హరిహర చౌదురి, ప్రమోద్ కుమార్ మహంతి, హరిహర చౌదురి, డి.శేషగిరి రావు, రవీంద్ర కుమార్ పాత్ర, ప్రియాస్ పట్నాయక్, పి.సన్యాసిరావు, భిభుతి రంజన్ మహాపాత్రో, బి.ఆర్.ప్రసాద్, జ్యోతిరంజన్ పూజారి తదితరులు ఉన్నారు. వారంతా కొరాపుట్ స్కూట్ హౌస్‌లో రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చ, నవరంగపూర్ ఎంపీ బలభద్ర మఝి, కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర, కొరాపుట్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుమంత ప్రధాన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ శాశ్వత సభ్యులు గౌతమ సామంతరాయ్, జయపురం బీజేపీ నేతలు లలిత అగర్వాల, బైద్యనాథ్ మిశ్ర ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మోహణ మఝిల నీతివంతమైన పాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్టు న్యాయవాదులు చెప్పారు.
ధాన్యం మండీకి తాళం
మల్కన్‌గిరి: జిల్లాలోని గౌడిగూడ పంచాయతీ ఎంవీ 11 గ్రామం వద్ద ధాన్యం మండీకి ఇంద్రావతి స్వయం సహాయక సంఘం మహిళలు తాళం వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా మండీ నిర్వహణ బాధ్యతలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పిటిలాగే ఈ ఏడాది కూడా జైమాకాళీ స్వచ్ఛంద సంస్థకు అప్పగిస్తున్నారని వాపోయారు. దీంతో విషయం తెలుసుకున్న జిల్లా ఆర్‌ఎంసీ అధికారులు, మల్కన్‌గిరి తహసీల్దార్ మండీ వద్దకు వెళ్లి మహిళలకు నచ్చజెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment