
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం
నెల్లిమర్ల: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలో యూటీఎఫ్ ముఖ్య కార్యకర్తల శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడల్ స్కూల్స్ ఏర్పాటు కోసం చేపడుతున్న కసరత్తులో చాలా పాఠశాలలు ఏకోపోధ్యాయ పాఠశాలలుగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం పిల్లల సంఖ్య ఎక్కువ ఉన్నచోట మోడల్ ప్రైమరీ స్కూల్స్‌గా మార్చాలని.. మిగిలిన ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు 12వ పీఆర్సీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించాలన్నారు. పీడీఎఫ్ తరఫున ఎమ్మెల్సీ బరిలో ఉన్న కోరెడ్ల విజయగౌరిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, జేఏవీఆర్‌కే ఈశ్వరరావు, జిల్లా కార్యదర్శులు పతివాడ త్రినాథ్, మద్దిల రాజు, హరి మోహన్, తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు
Comments
Please login to add a commentAdd a comment