ఖాళీ బిందెలతో నిరసన..
పర్లాకిమిడి: ఒకవైపు ఎండలు మండుతున్నాయి. మరోవైపు రాయఘడ బ్లాక్ గండాహతిలో జలాశయాలు, ఊటపాయలు, మహేంద్రతనయ నదిలో నీరు అడుగంటింది. దీంతో గురువారం ఉదయం 6 గంటల నుంచి గండాహతి కించిలింగి, గండాహతి– ఓడాసింగి రోడ్డుపై మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చెపట్టారు. గత రెండు రోజులుగా గండాహతి చుట్టు పక్కల గ్రామాల్లో తాగునీటికి అవస్థలు పడుతున్నారు. దీనిపై మహిళలు ఆగ్రహం ఆందోళన చేపట్టారు. మహేంద్ర తనయ నదిలో నీరు అంతరించిపోవడంతో వసుదా పథకం కింద గ్రామీణ తాగునీటి పథకం ద్వారా మంచినీటిని అందించలేకపోయాయి. ప్రభుత్వ అధికారులు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా అందిస్తామని హామీ ఇచ్చిన వరకు ఆందోళన విరమించేది లేదని మహిళలు తెలిపారు.
గండాహతి – ఒడాసింగి రోడ్డుపై
మహిళల రాస్తారోకో
తాగునీరు అందజేయాలని ఆందోళన
ఖాళీ బిందెలతో నిరసన..
Comments
Please login to add a commentAdd a comment