ఆన్‌లైన్ గేమ్‌కు విద్యార్థిని బలి
రాయగడ: మొబైల్‌లో ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడిన ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని రామనగుడ సమితి పరిఖితి పంచాయతీ గణపతిగూడ గ్రామంలో సయినా సాహు అలియాస్ టిన(15) అనే విద్యార్థిని వాళ్ల అమ్మమ్మ వద్ద ఉండేది. ఇటీవల పదో తరగతి పరీక్షలు పూర్తవ్వడంతో ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడింది. ఈ ఆన్‌లైన్ గేమ్స్‌లో భాగంగా మొదట కొంత మొత్తం డబ్బును పోగొట్టుకుంది. అయినా సమయం దొరికినప్పుడల్లా మరలా గేమ్స్ ఆడుతుండేది. ఈ క్రమంలో ఇటీవల రూ.4 లక్షలు గెలుచుకుంది. అయితే తాను గెలిపొందిన నగదును సదరు గేమ్‌కు చెందిన నిర్వాహకులు అకౌంట్‌కు క్రెడిట్ చేయకపోవడంతో మనస్తాపానికి గురైంది. పలుమార్లు కస్టమర్ కేర్‌కు తెలియజేసినా స్పందించకపోవడంతో బుధవారం రాత్రి ఇంటి పెరట్లో చున్నీ సాయంతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెరట్లోకి వెళ్లిన సయిన ఇంకా తిరిగి రాకపోవడంతో వాళ్ల అమ్మమ్మ వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించడంతో కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వాళ్లు వెళ్లి చూశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందజేశారు.
ఆన్‌లైన్ గేమ్‌కు విద్యార్థిని బలి
Comments
Please login to add a commentAdd a comment