చెరువులో యువతి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

చెరువులో యువతి మృతదేహం లభ్యం

Published Fri, Mar 14 2025 1:13 AM | Last Updated on Fri, Mar 14 2025 1:10 AM

చెరువ

చెరువులో యువతి మృతదేహం లభ్యం

మల్కన్‌గిరి: జిల్లాలోని ఖోయిర్‌పూట్‌ సమితి బుటిగూడ గ్రామ చెరువులో గురువారం ఉదయం ఒక యువతి మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. కొద్దిరోజుల క్రితం సోమనాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన డాలిమా పూజారి(25) అనే ఈ యువతి ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల కంపెనీలో పనికి వెళ్లింది. అక్కడ ఈమెకు బుటిగూడ గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడడంతో అతడితో పాటు బుటిగూడకు వచ్చింది. అయితే ఏమైందో ఏమో గానీ గురువారం ఉదయం చెరువులో మృతదేహమై తేలింది. కాగా బుధవారం ఆమె చెరువు వద్ద దుస్తులు ఉతుకుతూ కనిపించిందని, బహుశా అప్పుడే జారిపడి మరణించి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి బలిమెల పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఐఐసీ ధీరజ్‌ పట్నాయక్‌ తెలిపారు.

యువతులకు కుట్టు మిషన్లు పంపిణీ

మల్కన్‌గిరి: జిల్లాలోని పోడియా సమితి కార్యాలయంలో ఉత్కళ వీకర్‌ సెక్షన్‌ డవవప్‌మెంట్‌ సొసైటీ ఆధ్యర్యంలో యువతులను ప్రోత్సహించేందుకు కుట్టు మిషన్లు పంపిణీ చేపట్టారు. గ్రామంలోని యువతులు ఆర్థికంగా ఎదిగేందుకు కుట్టు మిషన్లు అందజేయడంతో పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. పోడియా గిరిజన అభివృద్ధి అధికారి అశ్విని కుమార్‌ మహాపాత్రో మాట్లాడుతూ.. యువతులు శక్తివంతమైతే సమాజం కూడా అభివృద్ధి దిశలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉత్కళ మైనారిటీ వీకర్‌ సెక్షన్‌ డవలప్‌మెంట్‌ సొసైటీ డైరెక్టర్‌ డా.ఎన్‌.రాఘువరావు, చీనం జనార్ధన్‌, మేషాక్‌ రవి తదితరులు పాల్గొన్నారు.

మా కుటుంబాలను ఆదుకోండి

జయపురం: తమ కుటుంబాలను ఆదుకోవాలని జయపురం గగణాపూర్‌ సేవా పేపరు మిల్లులో పనిచేసి మృతి చెందిన కార్మికుల భార్యలు సబ్‌ కలెక్టర్‌ ఎ.శొశ్య రెడ్డిని కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. తమ భర్తలు మరణించిన తర్వాత దుర్భరమైన జీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2020లో కొత్త యాజమాన్యం మిల్లు బాధ్యతలు చేపట్టిన తర్వాత తమకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదని వాపోయారు. అలాగే చెల్లించాల్సిన పీఎఫ్‌, పెన్షన్‌, గ్రాట్యూటీ బకాయిలు సైతం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం కార్మిక నేత ప్రమోద్‌ కుమార్‌ మహంతి నేతృత్వంలో మృతుల భార్యలు రుక్మిణి సౌర, జి.రాణి చౌదరి, కుణీ మండి, మీనతీ పుష్టి తదితరులు సేవా మిల్లు ప్రధాన గేటు ముందు ధర్నా చేపట్టారు.

స్వాభిమాన్‌ ఏరియాలో చీకట్లు

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి పాపర్‌మెట్ల పంచాయతీలో వారం రోజులుగా కరెంటు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అదనపు బిల్లులు రావడంతో వినియోగదారులు చెల్లించలేదు. దీంతో కరెంటు అంతరాయాలు తప్పడం లేదు. బిల్లులు వేలల్లో వచ్చాయని, అధికారులు స్పందించాలని కోరుతున్నారు. రెండు మూడు రోజుల్లో విద్యుత్‌ సదుపాయం పునరుద్ధరించకపోతే విద్యుత్‌ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
చెరువులో యువతి  మృతదేహం లభ్యం 1
1/2

చెరువులో యువతి మృతదేహం లభ్యం

చెరువులో యువతి  మృతదేహం లభ్యం 2
2/2

చెరువులో యువతి మృతదేహం లభ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement