29 కేజీల గంజాయి స్వాధీనం
● ఇద్దరు అరెస్టు
రాయగడ: గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని జిల్లాలోని మునిగుడ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి 29.540 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం ఎప్పటిలాగే పోలీసులు టికరపొడ గ్యాస్ గొడౌన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మునిగుడ వైపు వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో గంజాయి బస్తాలు పట్టుబడ్డాయి. దీనికి సంబంధించి కొంద్‌మాల్ జిల్లా బలిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బటాగుడ గ్రామానికి చెందిన మిలన్ కుమార్ నాయక్, మధ్యప్రదేశ్‌కు చెందిన మఖన్ కుహోరొను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు ఎస్‌డీపీఓ సంతొషిణి ఈ మేరకు బృందాన్ని ఏర్పాటు చేశారు. వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment