కాలువలో మునిగి వ్యక్తి మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితి సుపులు గ్రామంలో సోమా మాడి అనే వ్యక్తి గురువారం కాలువలో పడి మృతి చెందాడు. సోమా బుధవారం తన పొలంలో కలుపు మొక్కలు తీసేందుకు వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడి ఊరంతా వెతికారు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. గురువారం సాయంత్రం 3.30 గంటల సమయంలో కాలువలో సోమా మృతదేహాన్ని స్థానికులు గుర్తించి బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. ఐఐసీ రామేశ్వర్ ప్రదాన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment