విజ్ఞాన సంపదపై చర్చా వేదిక
జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ద్వారా విజ్ఞానం, ఆర్థిక అభివృద్ధి కోసం విజ్ఞానంపై బుధవారం సాయంత్రం చర్చావేదిక నిర్వహించారు. విశ్వవిద్యాలయ మానవ వనరుల విభాగ డైరెక్టర్ డాక్టర్ దేవేంధ్ర ఇందోరియ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కులపతి డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్ర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ద్వారా లభించే విజ్ఞానంపై ప్రసంగించారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా రిజిస్ట్రార్ మహేశ్వర చంద్ర నాయిక్, ప్రత్యేక అతిథిగా విశ్వ విద్యాలయ పరీక్ష విభాగ అధికారి రంజన్ కుమార్ ప్రధాన్, పీజీ కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో, ప్రొఫెషర్ జచిన్ కుమార్ నాయిక్‌లు పాల్గొని ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment