
డీఎస్సీతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదలకు డిమాండ్
విజయనగరం పూల్‌బాగ్ : డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించి సకాలంలో పోస్టులు భర్తీ చేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని గురజాడ గ్రంథాలయం ఆవరణలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. కూటమి విజయంలో నిరుద్యోగులు కీలక పాత్ర వహించారన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మెగా డీఎస్సీ సంతకం చేశారని, నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. వెంటనే డీఎస్సీ ప్రకటించి సకాలంలో పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని కోరారు. సమావేశంలో డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సతీష్, నిరుద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment