
సుజుకీ యాక్సెస్ 125 కొత్త మోడల్ ఆవిష్కరణ
శ్రీకాకుళం రూరల్: నగరంలోని పెదపాడు రోడ్డులో శ్రీ విజయలక్ష్మీ మోటార్స్‌లో సుజుకీ యాక్సెస్–125 నూతన మోడల్ స్కూటీని శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ద్విచక్ర వాహనం మహిళలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడంతో పాటు హెల్మెట్ విధిగా ధరించాలన్నారు.షోరూం మేనేజర్ అంధవరపు లక్ష్మణరావు మాట్లాడుతూ ఐదు కలర్స్‌తో నూతన మోడల్ స్కూటీ వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో బహుజన నేత కంఠ వేణు, సోమేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సిరిపురం బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం న్యూకాలనీ: భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా సిరపురం తేజేశ్వరరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కోర్ కమిటీ సమక్షంలో మినిట్స్ బుక్‌లో సంతకం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శవ్వాన ఉమామహేశ్వరి, బిర్లంగి ఉమామహేశ్వరరావు, ఎంబీజీ నాయుడు, చల్లా వెంకటేశ్వరరావు, రాఘవరావు, దుర్గారావుగాంధి, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.
సిక్కోలు మాస్టర్స్ అథ్లెట్స్ జోరు
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2025 పోటీల్లో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. అనంతపురం వేదికగా ఈ నెల 7 మొదలైన పోటీలు 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మార్చ్‌ఫాస్ట్‌లో జిల్లా క్రీడాకారులు ఆకట్టుకున్నారు. మొదటి రెండు రోజుల్లో త్రోస్, జంప్స్, రన్స్ విభాగాల్లో 20 పతకాలు సాధించినట్టు జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాలకొండ అప్పారావు తెలిపారు.
చైన్నెలో వలస కూలి మృతి
సంతబొమ్మాళి: మండలంలోని మర్రిపాడు పంచాయతీ శెలగపేట గ్రామానికి చెందిన తామాడ సింహాచలం (54) అనే వలస కూలి శనివారం చైన్నెలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. జీవనోపాధి కోసం పైప్ లైనింగ్ వర్క్ చేస్తుండగా మట్టి జారిపడటంతో కింద కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సింహాచలంకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
రిమ్స్ హాస్టల్లో పాముల భయం
శ్రీకాకుళం: రిమ్స్ వైద్య కళాశాల హాస్టల్ విద్యార్థులను పాముల భయం వెంటాడుతోంది. 20 రోజుల్లో రెండు సార్లు నాగుపాము రావడంతో వైద్య విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ మరుగుదొడ్లు అధ్వానంగా తయారయ్యాయని, అక్కడే పాములు సంచరిస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉండిపోవడం, చాలా గదులు అధ్వానంగా తయారువ్వడంతో విషసర్పాలు రెండో అంతస్తు వరకు వచ్చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
కోనేరులో పడి
మాజీ సైనికుడు మృతి
కాశీబుగ్గ : పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న బ్రాహ్మణవీధి కోనేరులో పడి వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి గ్రామా నికి చెందిన సిగలపల్లి కోటేశ్వరరావు (42) అనే మాజీ సైనికుడు మృతి చెందారు. ఈయన కాశీబుగ్గ తిలక్‌నగర్‌లో నివాసముంటున్నారు. స్నానానికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెతికారు. సాయంత్రానికి శవమై తేలడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కోటేశ్వరరావుకు తండ్రి మల్లేష్, తల్లి సరోజిని, భార్య నాగ, కుమారుడు అఖిల్ ఉన్నారు.

సుజుకీ యాక్సెస్ 125 కొత్త మోడల్ ఆవిష్కరణ

సుజుకీ యాక్సెస్ 125 కొత్త మోడల్ ఆవిష్కరణ

సుజుకీ యాక్సెస్ 125 కొత్త మోడల్ ఆవిష్కరణ

సుజుకీ యాక్సెస్ 125 కొత్త మోడల్ ఆవిష్కరణ

సుజుకీ యాక్సెస్ 125 కొత్త మోడల్ ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment