
మిల్లర్ల సంఘం కోశాధికారిగా నాగేశ్వరరావు
నరసన్నపేట: జిల్లా మిల్లర్ల సంఘం కోశాధికారిగా నరసన్నపేటకు చెందిన మిల్లర్ తంగుడు నాగేశ్వరరావు ఎంపికయ్యారు. ఇటీవలే జిల్లా సంఘ కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్లర్ల సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. నాగేశ్వరరావును మిల్లర్లు తంగుడు జోగారావు, సీతారామరాజు తదితరులు అభినందించారు.
చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం
నరసన్నపేట: మండలంలోని ఉర్లాంలో బంగారం షాపులో చోరీ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. సీఐ జె.శ్రీనివాసరావు శనివారం కూడా షాపును పరిశీలించగా.. సీసీఎఫ్ సీఐ, ఇతర సిబ్బంది సమక్షంలో ఆధారాలు సేకరిస్తున్నారు. స్థానికులు మాత్రం దొంగలు కుర్చీలు అమ్మడానికి వచ్చిన వారిలా ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చోరీలో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. వీరందరూ స్థానికంగానే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ముషిడిగట్టు వైపు నాలుగు సైకిళ్లపై శుక్రవారం ఉదయం వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఘనంగా ఆదిత్యుని కల్యాణం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణోత్సవం శనివారం ఘనంగా జరిగింది. భీష్మ ఏకాదశి సందర్భంగా ఉషా పద్మిని ఛాయా దేవేరులతో సూర్యనారాయణ స్వామి వారి కల్యాణమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అనివెట్టి మండపంలో ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణం జరిపించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, అర్చకులు ఇప్పిలి సాందీప్ శర్మ, ఈవో వై.భద్రాజీ, భక్తులు పాల్గొన్నారు.

మిల్లర్ల సంఘం కోశాధికారిగా నాగేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment