
● అభివృద్ధి పనులు ప్రారంభం
పర్లాకిమిడి: పట్టణంలో రాజవీధి జగన్నాథ మందిరం పరిసరాల్లో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి శనివారం ప్రారంభించారు. జగన్నాథ మందిరం వెలుపల విద్యుత్ వెలుగులు, పార్కింగ్ తదతర అభివృద్ధి పనులు రూ.లక్షలతో పురపాలక సంఘం నిర్మించింది. ఈ కార్యక్రమంలో పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, మున్సిపాలిటీ కార్యనిర్వాహణ అధికారి గౌర చంద్ర పట్నాయక్, వైస్ చైర్మన్ లెంక మధు, ఆర్.ఎం.సి.ఎస్ అధ్యక్షుడు ఎస్.గజపతిరావు, బీజేడీ పట్టణ అధ్యక్షుడు సిత్తు మహాపాత్రో, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment