
శబరి శ్రీక్షేత్రం కమిటీ సమావేశం
కొరాపుట్: రెండవ పూరీగా పిలవబడుతున్న కొరాపుట్ శబరి శ్రీ క్షేత్రం సర్వసభ్య సమావేశాన్ని కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ మ్యూజియంలో జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత, పొట్టంగి ఎమ్మెల్యే రాంచంద్ర ఖడం మాట్లాడుతూ.. పలు సూచనలు చేశారు. సవరల సంస్కృతిని ప్రతింబింబించే శ్రీక్షేత్రం కమిటీలో గిరిజనులకు 50 శాతం అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో జయపూర్, కొరాపుట్ ఎమ్మెల్యేలు తారా ప్రసాద్ భాహీనిపతి, రఘురాం మచ్చో పాల్గొన్నారు.
గుమ్మ ఘాటి వద్ద లారీ బోల్తా
రాయగడ: పొకేలి నుంచి జేకేపూర్‌కు కర్రల లోడుతో వస్తున్న ఒక లారీ సదరు సమితి గుమ్మ ఘాటీ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. శనివారం నాడు చోటు చేసుకున్న ఈ ఘటనలో లారీ డ్రైవరు స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థిఽతిని సమీక్షించారు.
ఆటో బోల్తా ●
● ఆరుగురికి తీవ్రగాయాలు
జయపురం: జయపురం సమితి బొయిపరిగుడ సమితి బదావటాల్ గ్రామ సమీపంలో గల సిందిముండి మందిర ప్రాంతంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బొయిపరిగుడ సమితి కాటపొడ పంచాయతీ ధనివలస గ్రామం నుంచి 8 మందితో శనివారం దసమంతపూర్ వారపు సంతకు వెళ్తున్నారు. బదావటాల్ గ్రామ సమీపంలో సిందిముండ మందిర ప్రాంతంలో ఆటో అదుపుతప్పి రోడ్డుపై నుంచి పక్కన ఉన్న అడవిలోనికి జారిపోయింది. గాయపడిన వారిని బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్‌కు స్థాని కులు తరలించారు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స చేసి ఇళ్లకు పంపినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ బొయిపరిగుడ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో
వివాహిత మృతి
జయపురం: రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి చెందారు. కుమార్తెను కళాశాలలో దింపేసి వస్తుండగా బైక్ ఢీకోవడంతో తీవ్రంగా గాయపడి మరిణించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ విషాద సంఘటన 26వ జాతీయ రహదారిలో శుక్రవారం చోటు చేసున్నట్లు పట్టణ పోలీసు అధికారి రమణీ రంజన్ దొలాయి శనివారం వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన బైకిస్టు భయంతో వాహనాన్ని వదిలేసి పరారైనట్టు పేర్కొన్నారు. పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన బైక్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరణించిన మహిళ స్థానిక కొత్తవీధికి చెందిన దొళమండప సాహి పద్మ సాహుగా గుర్తించారు. పద్మ సాహు కుమార్తె స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో చదువుతోంది. కుమార్తెను మధ్యాహ్నం కళాశాలలో విడిచి పద్మ ఇంటికి వెళ్తుండగా.. కళాశాలకు కొద్ది దూరంలో బైక్ వేగంగా వస్తూ ఆమెను ఢీకొట్టడంతో తీవ్రమైన గాయాలతో పడిపోయారు. కళాశాల విద్యార్థినులతోపాటు పద్మ కుమార్తె తల్లిని చూచి వెంటనే స్థానికుల సహకారంతో జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు కొరాపుట్‌లోని సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే కొరాపుట్ తీసుకెళ్తుండగా మార్గంలో బరిణిపుట్‌లోని ఓ ప్రైవేటులో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. బైకిస్టును అరెస్టు చేయాలని, పద్మ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment