అనుమానాస్పద స్థితిలో నవ వధువు మృతి
రాయగడ: అనుమానాస్పద స్థితిలో నవవధువు ప్రాణాలు కోల్పోయింది. ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు అంటుండగా.. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అమ్మాయి తరఫువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భర్తను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పెళ్లయి ఐదు నెలల గడిచాయి. అన్యొన్యంగా కాపురం చేసుకుంటున్న ఆ దంపతుల్లో ఎటువంటి తగాదాలు నెలకొన్నాయో గాని ఆ నవ వివాహిత ఉరికి వేలాడుతూ శవమై కనిపించింది. స్థానిక సాయిప్రియనగర్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని ఇది ఆమె భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని సదరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివాహిత భర్తను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. స్థానిక సాయి ప్రియనగర్‌లో బిభూతి కిశోర్ బాగ్ (21) ఆమె భర్త రమేష్ నాయక్‌లు ఐదు నెలల క్రితం వివాహం చేసుకుని నివాసముంటున్నారు . ఈ క్రమంలో శుక్రవారం రాత్రి బిభూతి కిషొర్ బాగ్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం ఆమెను చికిత్స కోసం స్థాఽనిక ప్రభుత్వ ఆస్పత్రికి రమేష్ తీసుకువచ్చాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే ఇది ఎంతమాత్రం ఆత్మహత్య కాదని తన కూతురును భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇది హత్యా, లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
హత్య చేశారంటూ కన్నవారు
పోలీసులకు ఫిర్యాదు
పోలీసుల అదుపులో భర్త
Comments
Please login to add a commentAdd a comment