క్షయ కబళిస్తోంది..!
● టీబీ వంద రోజుల కార్యక్రమంలో అధిక సంఖ్యలో కేసుల గుర్తింపు
● రెండు నెలల్లో 401 కేసుల నిర్ధారణ
● గతేడాది డిసెంబర్ 7న జిల్లాలో ‘టీబీ
వంద రోజుల కార్యక్రమం’ ప్రారంభం
● రెండు నెలల్లో 28, 800 మందికి
క్షయ నిర్ధారణ పరీక్షలు
పరీక్షలు చేసుకోవాలి..
రెండు వారాలకు మించి దగ్గు , జ్వరం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గడం వంటి క్షయ వ్యాధి లక్షణాలు ఉంటే సమీపంలో ఉన్న కఫం పరీక్ష కేంద్రంలోకి వెళ్లి కఫం పరీక్ష చేసుకోవాలి. జిల్లాలో కఫం పరీక్ష కేంద్రాలు 34 ఉన్నాయి. అదేవిధంగా టీబీ యూనిట్లు 14 ఉన్నాయి. వీటిలో ఏ కేంద్రానికి వెళ్లినా ఉచితంగా పరీక్ష చేసి మందులు అందజేస్తారు.
28,800 మందికి పరీక్షలు..
టీబీ వంద రోజుల కార్యక్రమంలో ఇప్పటివరకు 4.38 లక్షల మందిని స్క్రీనింగ్ చేశారు. ఇందులో 28, 800 మందికి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, 401 మందికి వ్యాధి నిర్ధారణ జరిగింది. జిల్లాలో ప్రస్తుతం 1411 మంది క్షయవ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు.
క్షయ కబళిస్తోంది..!
Comments
Please login to add a commentAdd a comment