ఆప్కాస్ రద్దు ఆలోచన మానుకోవాలి
● రౌండ్ టేబుల్ సమావేశంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది సంఘాల జేఏసీ డిమాండ్
విజయనగరం అర్బన్: ఆప్కాస్ రద్దు చేయాలన్న మంత్రివర్గ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. ఆదివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మంత్రివర్గం నిర్ణయాల ప్రకారం ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్‌ను రద్దు చేసే ఆలోచనలో ఉందన్నారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కాకుండా రోస్టర్ పద్ధతి పాటించే కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే నియామకాలు చేపట్టడం వల్ల వివిధ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమమ్ ఆఫ్ టైమ్ స్కేల్ వర్తింప చేయకూడదని ఇటీవల విడుదల చేసిన జీఓ 2ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.బాలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు, డి.సాయిప్రసాద్, కె.సురేష్, కె.శ్రీనివాస్, రాజేష్, ఈశ్వరరావు, పి.దుర్గారావు, బి.శ్రీనివాసరావు, మజ్జి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment