దివ్యాంగులను గౌరవించాలి
రాయగడ: దివ్యాంగులను మనమంతా గౌరవించాలని, అవసరమైతే వారికి అండగా నిలవాలని గంజాం జిల్లా దివ్యాంగుల మహాసంఘం అధ్యక్షుడు ఆనందరావు అన్నారు. సదరు సమితి హలువా తోటలో జిల్లా దివ్యాంగుల మహాసంఘం వార్షికోత్సవం ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేసిందని అన్నారు. అయితే అవగాహన లోపంతో కొంతమంది దివ్యాంగులు ఈ సదవకాశాలు వినియోగించుకోలేకపోతున్నారని తెలిపారు. హక్కులు, అధికారాల గురించి పోరాడాలని హితవు పలికారు. జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారి పుష్పలత దీక్షిత్, విద్యావేత్త డాక్టర్ డీకే మహంతి, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా దివ్యాంగుల మహాసంఘం అధ్యక్షులు శిశిర్ రాహుల్, కార్యదర్శి అమరేంద్ర నాథ్ ఆద్వర్యంలొ జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి పెద్ద సంఖ్యలొ దివ్యాంగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment