ట్రాక్టర్ ఢీకొని వైఎస్సార్ సీపీ నాయకుడు మృతి
ఇచ్ఛాపురం రూరల్: బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు మృతి చెందారు. అరకబద్ర గ్రామానికి చెందిన రంగాల కృష్ణారెడ్డి(63) ఆదివారం ధర్మపురం బంధువుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఇంటికి తన ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా, ధర్మపురం–ఈదుపురం రోడ్డులో వెళ్తున్న ట్రాక్టర్ బలంగా ఢీ కొట్టింది. పంట పొలాల్లో పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈయనకు భార్య సీతమ్మ, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. రూరల్ ఎస్‌ఐ ఈ.శ్రీనివాస్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి అంకిత భావంతో పనిచేసిన కృష్ణారెడ్డి మృతి పట్ల జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపీపీ బోర పుష్ప, జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పాడ నారాయణమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాంపత్ని చిట్టిబాబు, నాయకులు సంతాపం తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment