రాయగడ: పెళ్లి చేసుకుంటానని నమ్మించి విద్యార్థినిని మోసం చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు.. బిసంకటక్‌లోని ఒక ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని జిగిడి ప్రాంతానికి చెందిన ఉమాశంకర్ మాఝి అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడేవాడు. దీంతో అతని మాయమాటలను నమ్మిన విద్యార్థిని సైతం ప్రేమించింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో శారీరకంగా దగ్గరయ్యారు. అయితే కొద్ది రోజులుగా యువతి ఆరోగ్యం క్షీణించడంతో ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు బిసంకటక్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినిని పరిశీలించిన వైద్యులు ఆమె గర్భిణిగా నిర్ధారించారు. దీంతో పాఠశాల నిర్వాహకులు పోలీసుస్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా మోసపోయిన విద్యార్థిని వివరాలు చెప్పడంతో ఉమాశంకర్‌ను అరెస్టు చేశారు. దర్యాప్తులో సదరు యువకుడికి ఇదివరకే వివాహం అయినట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment