నేటి నుంచి వాసుదేవుని బ్రహ్మోత్సవాలు
కాశీబుగ్గ: మందస పట్టణంలో కొలువైన వాసుదేవు ని 16వ బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రా రంభం కానున్నాయి. ఈ నెల 23 వరకు ఉత్సవాలు జరుగుతాయి. 14వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో రాజుల కాలం నుంచి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 1744 సంవత్సరంలో నరసాపురానికి చెందిన తెలికిచెర్ల కందాడ రామాను జాచార్యస్వామి ఇక్కడ సంస్థానాచార్యులుగా ఉండేవారు. ఆయన వద్ద త్రిదండి శ్రీమన్నారాయణ రా మనుజ పెద్ద జీయర్ స్వామి, గోపాలాచార్య స్వా మి శిష్యులుగా ఉండేవారు. అప్పట్లో ఇక్కడ ఉన్న వేద పాఠశాలలో పండితులు విధ్యనభ్యసించేవారు. 1950 వరకు ఆలయంలో క్రతువులు జరిగేవి. రాజు ల పాలన అనంతరం కొన్ని దశాబ్దాల పాటు ఆల యం మూతపడి శిథిలావస్థకు చేరుకుంది. చిన్నజీయరుస్వామి వాసుదేవ ఆలయ చారిత్రక ప్రాముఖ్యతను గుర్తించి తన గురువు స్మారకార్థం జీర్ణోద్ధరణ చేసేందుకు సంకల్పించి 2001 నుంచి పున:నిర్మాణ పనులను చేపట్టారు. 2009లో ఆలయాన్ని పునఃప్రతిష్టించారు. ఆలయంలో రాజుల పాలన కా లంలో ఉన్న విగ్రహాన్నే పునఃప్రతిష్టించారు. ఆలయంలో ఉన్న వాసుదేవ పెరుమాళ్ విగ్రహ నిజరూ పం తిరుపతిలో ఉన్న వెంకటేశ్వరస్వామి విగ్రహం మాదిరిగానే ఉంటుంది.
బ్రహ్మోత్సవ కార్యక్రమ వివరాలు
● ఈ నెల 17వ తేదీ సోమవారం ఆంజనేయస్వామి అభిషేకం.
● 18న శ్రీవాసుదేవ పెరుమాళ్ అభిషేకం, శ్రీవిశ్వక్సేన ఆరాధన, అంకురారోపణం.
● 19న గరుడపూజ, ధ్వజారోహణం, హనుమద్వాహనం, శేషవాహన సేవ.
● 20న కల్పవృక్ష వాహనము, ఎదుర్కోలు ఉత్సవం.
● 21న శ్రీ వాసుదేవ్ పెరుమాళు కల్యాణ మహోత్సవం, గరుడవాహన సేవ.
● 22న పొన్నచెట్టు వాహనము, తెప్పోత్సవం, అశ్వవాహనము
● 23న రథోత్సవ, చక్రస్నానం, ద్వాదశరాధన, శ్రీపుష్పయాగం.
నేటి నుంచి వాసుదేవుని బ్రహ్మోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment