ఆదాయానికి మద్యమే మార్గమంటూ..
● గ్రామాలకు డోర్ డెలివరీ చేస్తున్న టీడీపీ నాయకుడు
● కపాసుకుద్ది కేంద్రంగా బెల్టులకు మద్యం సరఫరా
● మత్స్యకార గ్రామాలకు అధికంగా మద్యం పంపిణీ
ఇచ్ఛాపురం రూరల్: కొత్త మద్యం పాలసీతో తెలుగు తమ్ముళ్లు జేబులు నింపుకుంటున్నారు. గ్రామాలకు అక్రమంగా మ ద్యం తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. కవిటి మండలం మత్స్యకార గ్రా మానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఇలా మద్యం సరఫరా చేసిన వైనం వెలుగు చూడడంతో అతను ప్రస్తుతం పరారైపోయాడు. ఈ నాయకుడు ప్రస్తుతం మత్స్యకార సొసైటీ అధ్యక్షుడిగా, రేషన్ షాపు డీలర్ ప్రతినిధిగా పరపతి సంపాదించాడు. తన వ్యాపారానికి కవిటి మండలం కపాసుకుద్ది కేంద్రంగా చేసుకుని ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి కపాసుకుద్ది, కర్రివారిపాలెం, ఇద్దివానిపాలెం, బెజ్జిపుట్టుగ, బొరివంక, కుసుంపురం, బల్లిపుట్టుగ వరకు బెల్టు షాపులను ఎంచుకొని ఇచ్ఛా పురం మండలం కొఠారీ వైన్ షాపుల వద్ద నుంచి రాత్రి సమయాల్లో సరుకును తీసుకొని పై గ్రామాలకు డోర్ డెలివరీ చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. బుధవారం ఇచ్ఛాపురం రూరల్ పోలీసులకు సుమారు రెండు లక్షల రూపాయల మద్యం దొరకడంతో.. సరుకును తీసుకువెళ్తున్న వ్యాను డ్రైవర్ ఈ ‘బాబు’ బండారాన్ని బయటపెట్టేశాడు. దీంతో రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ నేత పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గ్రామానికో రేటు..
గ్రామాల్లో బెల్టు షాపును నిర్వహించేందుకు గ్రామానికో రేటును ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మత్స్యకార గ్రామాల్లో రెండేసి బెల్టు షాపులు చొప్పున ఏర్పాటు చేసి ఒక్కో బెల్టు షాపు నుంచి గ్రామానికి రూ.30వేల నుంచి రూ.50 వేల వరకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నా రు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఒక రేటు, ఎకై ్సజ్ శాఖ స్టేషన్‌కు ఒక రేటును నెలవారీ మామూళ్లుగా ఫిక్స్ చేసినట్లు సమాచారం
పాన్ షాపులు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లే అడ్డా..
గత ప్రభుత్వంలో ఎక్కడా బెల్టు షాపుల ఊసే లే దు. ఒకవేళ అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులు, సెబ్ అధికారులు దాడు లు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేసేవా రు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లోని పాన్‌షాపులు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను ఏకంగా మినీబార్‌లుగా మార్చేశారు. ఇక్కడ బెల్టు షాపులు నిర్వహిస్తూ రోజంతా మందుబాబులకు సరుకు అందిస్తున్నారు. బెల్టు షాపు నిర్వాహకులు క్వార్టర్ బాటిల్‌కు రూ.50 అదనంగా తీసుకుంటున్నారు. ఈ బెల్టుషాపులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నిర్వహిస్తున్నారన్నది బహిరంగ రహస్యం.
Comments
Please login to add a commentAdd a comment