ఆదిత్యుని సన్నిధిలో మాఘమాస సందడి
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో మాఘమాస సందడి నెలకొంది. మాఘ మాసం రెండో ఆదివారం సందర్భంగా ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఇతర జిల్లాల నుంచి సైతం భారీగా భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఇంద్రపుష్కరిణి వద్ద పిడకల పొయ్యిలపై క్షీరాన్నాన్ని వండి ఆదిత్యునికి నివేదించారు. తలనీలాల మొక్కులు తీర్చుకుని ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. ఆలయంలో స్వామివారి మూలవిరాట్టును ప్రత్యేకంగా అలంకరించి వేకువజామున 6 గంటల నుంచే ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో సర్వదర్శనాలకు సిద్ధం చేశారు. భక్తులకు ఎండ వేడి నుంచి రక్షణగా ఆలయ ఈవో వై.భద్రాజీ ఆధ్వర్యంలో దర్శన మార్గాల్లో టెంట్లు వేయించారు.మంచినీటిని సరఫరా చేయించారు. మరుగుదొడ్లు విషయంలో మాత్రం భక్తులు అవస్థలు పడ్డారు. పలువురు అధికారులు ఆదిత్యున్ని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి రావడంతో వివిధ దర్శన టికెట్ల విక్రయాల ద్వారా రూ.8.15 లక్షలు, విరాళాలు, ప్రత్యేక పూజలు టికెట్ల విక్రయాల ద్వారా రూ.1,08,740, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 2.25 లక్షల వరకు ఆదాయం లభించినట్లు ఈవో ప్రకటించారు.
ఆదిత్యుని సన్నిధిలో మాఘమాస సందడి
ఆదిత్యుని సన్నిధిలో మాఘమాస సందడి
Comments
Please login to add a commentAdd a comment