ఆటో బోల్తా..ఆరుగురికి గాయాలు
నరసన్నపేట: జాతీయ రహదారిపై దేవాది సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. అతివేగంతో వస్తున్న ఆటో పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు స్పందించి క్షతగాత్రులను బయటకు తీశారు. ఆర్.ఈశ్వరమ్మ, కొండాలమ్మ, పైడమ్మలకు బలమైన గాయాలు కాగా, మిగిలిన ముగ్గురూ స్పల్ప గాయాలతో బయటపడ్డారు. ఎచ్చెర్ల మండలం సనపలవానిపేటకు చెందిన వీరంతా ఆటోలో నిమ్మాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఎన్‌హెచ్ అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎన్‌హెచ్ పెట్రోలింగ్ పోలీసులు సకాలంలో స్పందించి తగిన సహాయం అందించారు.
స్తంభాన్ని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
శ్రీకాకుళం రూరల్: రాగోలు జంక్షన్ వద్ద ఆదివారం పాతపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఎదరుగా వస్తున్న స్కూటీని తప్పించబోయి ఎడమవైపు కరెంట్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కానప్పటికీ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. విషయం తెలుసుకున్న హైవే మొబైల్ పెట్రోలింగ్ సిబ్బంది ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తా..ఆరుగురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment