పినాంకి కొండల్లో ఎలుగు సంచారం
జయపురం: జయపురం పట్టణం అటవీ విభాగం, పారాబెడల మధ్య గల పినాంకి కొండ రిజర్వ్ ఫా రెస్టులో ఎలుగు సంచరిస్తోంది. దీంతో స్థానికులు భయపడుతున్నారు. సమాచారం అందిన అటవీ విభాగ అధికారులు అడవిలో గాలింపు చర్యలు చేప ట్టారు. జయపురం అటవీ డివిజన్ అధికారి ప్రతాప్ కుమార్ బెహర, ఎస్‌ఎఫ్‌ఓ డాక్టర్ అమిత్ కుమార్ నాయిక్, రేంజర్ సచ్చితానంద పరిడ, ఫారెస్ట్ శశాంక మహరాణ, ఫారెస్టు గార్డ్ సతీష్ కుమార్ కాళో, వన్య జంతువుల పరిరక్షణ విభాగ టీమ్ లీడర్ కృష్ణ కేశవ షొడంగి అడవిలో గాలించారు. గత 12 వ తేదీన జయపురం పట్టణం మొకాపుట్ ప్రాంతంలో ఒక ఎలుగుబంటి తిరుగుతున్న ఫొటోలు సీసీ కెమెరాలో కనిపించాయి. 13 వ తేదీన పినాంకి పర్వత ప్రాంతంలో ఎలుగుబంటి సంచరించటం స్థానికుల కంట బడింది. ఆ విషయం తెలిసిన స్థానికులు వెంటనే అటవీ విభాగ అధికారులకు తెలియ జేశారు. దీంతో వారు గాలింపు మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment