మార్చి 29న బార్ అసోసియేషన్ ఎన్నికలు
జయపురం: కొరాపుట్ జిల్లా బార్ అసోషియేషన్ (జయపురం) కార్యవర్గ ఎన్నికలు 2025–26 ఏడాదికి సంబంధించి మార్చి 29న జరగనున్నాయి. ఇందుకు సంబంధించి సన్నాహక సమావేశం ఆదివారం మధ్యాహ్నం జిల్లా కోర్టు ఆవరణలోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగింది. అధ్యక్షులు త్రినాథ్ సిగ్‌లాల్ అధ్‌ూక్షతన జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో సీనియర్ న్యాయవాది దాసరథి పట్నాయన్‌కును ఎన్నికల అధికారిగా నియమించారు. ఎన్నికల నిర్వహణపై సభ్యులకు ఈయన శిక్షణ ఇస్తారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మార్చి ఐదు నుంచి ఏడో తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎనిమిదో తేదీన నామినేషన్‌లు వేసిన వారి జాబితా ప్రకటిస్తారు. తొమ్మిదో తేదీన నామినేషన్లను పరిశీలన జరుగుతుంది. స్క్రూటినీ తరువాత పదో తేదీన జాబితా ప్రకటిస్తారు. 12వ తేదీలోగా నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. 13వ తేదీన ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 29వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం నాలుగు ఓట్ల లెక్కిపు ప్రారంభించి విజేతలను ప్రకటిస్తారు. సన్నాహక సమావేశంలో ముఖ్యమైన విషయాలపై చర్చించారు. అలాగనే పలు తీర్మానాలు చేశారు. ముఖ్యంగా జయపురంలో ప్రముఖ న్యాయవాది, అసోషియేషన్ మాజీ అధ్యక్షులు, కొరాపుట్ జిల్లా కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన స్వర్గీయ సత్యనారాయణ అధికారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపాదన చేసింది. అలాగే జయపురంలో సర్క్యూట్ కోర్టును కనీసం నెలలో ఒక సారి నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను సమావేశం కోరింది. జయపురంలో మరో ఏడీజే కోర్టు ఏర్పాటు చేయాలని, ఎన్‌డీపీఎస్ కేసుల విచారణ నిమిత్తం జయపురంలో ఒక ప్రత్యేక కోర్టు నెలకొల్పాలని, రాష్ట్ర కన్జ్యూమర్ సర్క్యూట్ కోర్టు నెల కొల్పాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. ఎన్నికల అధికారిగా నియమితులైన దాసరథి పట్నాయక్‌ను న్యాయవాదులు అభినందించారు. సమావేశంలో ఉపాధ్యక్షులు సత్యబ్రత పాఢీ, కార్యదర్శి మహేంద్ర అధికారి, సిహాయ కార్యదర్శి పి.సన్యాసిరావు, ట్రెజరర్ సహదేవ్ పట్నాయక్, బాలా రాయ్‌సచిన్ కుమార్ పాఢీ, డి.శేశగిరిరావు పాల్గొన్నారు.
మార్చి 29న బార్ అసోసియేషన్ ఎన్నికలు
మార్చి 29న బార్ అసోసియేషన్ ఎన్నికలు
Comments
Please login to add a commentAdd a comment