దోపిడీకి విఫలయత్నం
జయపురం: ఒక యువకుడిని దోచుకునేందుకు దుండగులు చేసిన ప్రయత్నం విఫలం కాగా.. ఆ సంఘటనలో ఒకడిని పోలీసులు అరెస్టు చేసినట్లు జయపురం సదర్ పోలీసు అధికారి ఈశ్వర తండి ఆదివారం వెల్లడించారు. ఆయన వివరణ ప్రకారం ఈ నెల 14 వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో జయపురం సమితి బంకబిజా గ్రామం రాజేంద్ర స్వయి జయపురంలో పనులు ముగించుకుని సైకిల్‌పై బంకబిజ గ్రామానికి వెళ్తుండగా బంకబిజ కూడలి వద్ద నలుగురు దుండగులు రాజేంద్రను అడ్డగించారు. రాజేంద్ర వద్ద గల డబ్బు ఇతర సామగ్రి ఇవ్వాలని బెదిరించారు. అంతలో గ్రామస్తులు అటుగా రావడంతో దుండగులు పారిపోయారు. అయితే వారిలో ఒకడు ప్రజలకు దొరికిపోయాడు. అతడిని సదర్ పోలీసులకు అప్పగించారు. నిందితుడు రమేష్ బెహర(54)ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
లాడ్జిలో యువకుడి మృతదేహం
రాయగడ: లాడ్జిలో ఒక యువకుడి మృతదేహాన్ని జిల్లాలోని టికిరి పోలీసులు శనివారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. మృతుడు తమిళనాడు రాష్ట్రంలోని తిరిచి ప్రాంతానికి చెందిన ఎస్.అబ్దుల్ హాసన్ (32)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం సాయంత్రం లాడ్జి గదిని శుభ్రపరిచేందుకు సిబ్బంది వెళ్లగా, లాడ్జి గదిలో ఉరికి వేలాడుతూ యువకుని మృతదేహాం కనిపించింది. దీంతో మేనేజర్‌కు సమాచారం అందించగా వెంటనే టికిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు టికిరిలోని ఒక కర్మాగారంలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.
మారణాయుధాలు చూపి దోపిడీ
జయపురం: మారణాయుధాలతో భయపెట్టి పంచాయతీ కార్యనిర్వాహక అధికారి(పీఈఓ) నుంచి దాదాపు రూ.8.6 లక్షలు దోచుకు పోయిన ఘటన ఆలస్యంగా తెలిసింది. ఈ సంఘటన జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి బిసింగపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. బొడిగాం పంచాయతీ పీఈఓ అర్జున పాత్రో పంచాయతీ సమితిలో లబ్ధిదారులకు ప్రతి నెల బొరిగుమ్మ సమితి కార్యాలయం నుంచి డబ్బు తీసుకువచ్చి ఇచ్చేవారు. శనివారం మధ్యాహ్నం బైక్‌పై డబ్బు తీసుకుని బయల్దేరారు. మార్గంలో బిసింగపూర్ పోలీసు స్టేషన్ పరిధి రతాలీ–బొడిగాం రోడ్డులో ఆరుగురు అర్జున్‌పై దాడి చేసి అతడి వద్ద ఉన్న డబ్బును తీసుకెళ్లిపోయారు. సమాచారం అందిన వెంటనే బిసింగపూర్ పోలీసులు సంఘటనా ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే బొడిగాం పంచాయతీ సర్పంచ్ కరుణ బొడొనాయిక్ స్థానిక ప్రజలతో అక్కడకు చేరుకున్నారు. బిసింగపూర్ పోలీసు అధికారి సూరజ్ ప్రధాన్ దర్యాప్తు ప్రారంభించారు.
దొంగతనం కేసులో ముగ్గురు అరెస్టు
రాయగడ: దొంగతనం కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో రాయగడ పిట్లవీధికి చెందిన భీముడు హుయిక, కిషొర్ మండంగి, రింటు కడ్రకలు ఉన్నారు. వారి వద్ద నుంచి 1.74 లక్షల రుపాయల నగదుతో పాటు ఒక స్కూటీ, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సదరు పోలీస్ స్టేషన్ ఐఐసీ కే కే బికే కుహోరో ఆదివారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల ఆరో తేదీన స్థానిక న్యూకాలనీకి చెందిన టి.గౌరిశంకర్ స్కూటర్ డిక్కీలో రూ. ఎనిమిది లక్షలు ఉంచగా.. గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
దోపిడీకి విఫలయత్నం
దోపిడీకి విఫలయత్నం
Comments
Please login to add a commentAdd a comment