● ఆటలతో ఆరోగ్యం
జయపురం: ఆటలతో ఆరోగ్య సిద్ధిస్తుందని, విద్యార్థులు ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కొరాపుట్ జిల్లా విద్యాధికారి ప్రశాంత కుమార్ మహంతి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన క్రీడా విజేతల బహుమతుల ప్రధాన ఉత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమేనని ఆయన అన్నారు. ప్రతి వారిలోనూ ప్రతిభ ఉంటుందని, దాన్ని బయటకు తీస్తే విజయం సొంతమవుతుందన్నారు. మొబైల్ చూస్తూ సమయం వ్యర్థం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా డైట్ ప్రిన్సిపాల్ రూప్‌చంధ్ సొరేన్, బ్లాక్ అదనపు విద్యాధికారి ప్రియంబత పాత్రో, కోఆర్డినేటర్ చంద్ర కళా బగర్త, విజ్ఞాన విభాగ అధ్యాపకులు అనంత దళపతి పాల్గొన్నారు. టీచర్లు విశ్వరంజన్ గౌఢ, ప్రభాతీ పాణిగ్రహి, హితకర చరిడి, దీపక సాహు, తనవీర్ మహమ్మద్, నిర్మల తండిక, సౌమ్యరంజన్ పట్నాయిక్, దేవేంద్ర పాడి, కె.ప్రమీల, శుభశ్మిత సాహు, రశ్మిత నాహక్, సాగరిక పాత్రో, బణిత శతపతి తదితరులు పాల్గొన్నారు.
● ఆటలతో ఆరోగ్యం
Comments
Please login to add a commentAdd a comment