అడవుల సంరక్షణ అందరి బాధ్యత
రాయగడ: అడవులను సంరక్షించడం మనందరి బాధ్యత అని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అన్నారు. స్థానిక రైతుల కాలనీలో గల ఫారెస్ట్ పార్క్‌లో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అడవుల సంరక్షణపై అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కొంతమంది అవగాహన లోపంతో అడవులు తగుల బెడుతున్నారని అన్నారు. దీని వల్ల పర్యావరణానికి పెను ముప్పు సంభవిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చని చెట్లతో ఉన్న అడవులను తగుల బెట్టడం వల్ల విలువైన ఔషధ వృక్షాలు నాశనం అవ్వడంతో పాటు పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లుతుందని అన్నారు. ఏ ప్రాంతంలో అయినా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే 112 కు డయల్ చేస్తే శకటాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అటవీ రేంజర్ కామేశ్వర్ ఆచారి మాట్లాడుతూ ఇలాంటి తరహా అవగాహన కార్యక్రమాలు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి ప్రచారం కల్పిస్తున్నారని తెలిపారు. రాయగడ సమితి అధ్యక్షురాలు టున్ని హుయిక, పర్యావరణవేత్త గౌరంగ చరణ్ , జిల్లా పరిషత్ సభ్యులు సంధ్యా పులక తదితరులు పాల్గొన్నారు.
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
Comments
Please login to add a commentAdd a comment