కెనాల్‌లో గుర్తు తెలియని యువకుని మృతదేహం
జయపురం: అప్పర్ కొలాభ్ సాగునీటి ప్రాజెక్టు ధన్‌పూర్ శాఖా కెనాల్‌లో ఆదివారం ఉదయం 35 ఏళ్ల యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి జయపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏఎస్సై రాజేంద్రపంగి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని కెనాల్ నుంచి బయటకు తీశారు. శవం కుళ్లిపోయింది. చనిపోయి రెండు రోజులుపైనే ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తి వివరాల కోసం పోలీసులు స్థానికంగా విచారణ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రి జయపురం మార్చురీకి తరలించారు. మార్చురీలో 96 గంటలు మృతదేహాన్ని ఉంచుతామని.. ఇలోగా కుటుంబ సభ్యులు వస్తే అప్పగిస్తామని, లేకపోతే నిబంధనల ప్రకారం తరువాత చర్యలు తీసుకుంటామని జయపురం పట్టణ పోలీసు అధికారి రమణీ రంజన్ దొలైయ్ వెల్లడించారు. పట్టణ పోలీసు స్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment