ఎండలోబడి..
రథసప్తమి వెళ్లాక.. ఎండలు మండుతున్నాయి.. రెండు నిమిషాలు బయట ఉంటేనే.. నెత్తిన అగ్నిగోళం పెట్టుకుని తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. పెద్దవారే ఎండల ధాటికి బెంబేలెత్తిపోతున్నారు. అలాంటిది చిన్న పిల్లలు.. విద్యార్థులు.. ఏకధాటిగా కూర్చొన్న చోట నిలువ నీడ లేక.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పందిర నీడన ఒకేచోట ఉండాలంటే సాధ్యమేనా? రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సొంత నియోజకవర్గం సాలూరులోనే విద్యార్థులకు ఈ దుస్థితి ఎదురుకావడం గమనార్హం.
సాలూరు మండలం తోనాం పంచాయతీ మెట్టవలస గ్రామంలో గతంలో ఆర్సీఎం పాఠశాల ఉండేది. అది ఒక పాత భవనంలో నడిచేది. రెండేళ్ల కిందట అది కూలిపోవడంతో దానిని ఎంపీపీ స్కూల్‌గా మార్చారు. తర్వాత కొన్నాళ్లపాటు తాత్కాలికంగా జీసీసీ భవనంలో పాఠశాలను నడిపించారు. అనంతరం ఆ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడంతో అక్కడ ఖాళీ చేయించారు. ప్రస్తుతం పిల్లలకు పాఠాలు ఒక చెట్టు కింద, పందిరిలో బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలకు సరైన సదుపాయాలు లేక ఎండలో ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల గురించి ప్రస్తుత గిరిజన శాఖ మంత్రికి విన్నవించినా స్పందన శూన్యం. ప్రస్తుతం ఊరిలో 52 మందికి పైగా పిల్లలు ఊరి చివరన గ్రామస్తులు, ఉపాధ్యాయులు కలిసి ఏర్పాటుచేసిన పందిరి నీడలోనే చదువుకుంటున్నారు. ఇంకొందరు ఇతర పాఠశాలలకు వెళ్తున్నారు. అసలే ఎండలు. ఆపై ఆరుబయట చదువులతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఒక షెల్టర్ అయినా ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. పిల్లల చదువు కష్టాలకు ఈ చిత్రాలే సాక్ష్యం.
– సాక్షి, పార్వతీపురం మన్యం
ఎండలోబడి..
ఎండలోబడి..
ఎండలోబడి..
ఎండలోబడి..
Comments
Please login to add a commentAdd a comment