జీబీఎస్‌పై అప్రమత్తం
● కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం: గులియబుల్ భారే సిండ్రోమ్ (జీబీఎస్)పై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. జీబీఎస్‌పై వైద్యశాఖ, పంచాయతీరాజ్‌శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు జీబీఎస్‌పై అవగాహన కల్పించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను వివరించడంతో పాటు వేడినీరు తాగడం, వేడి ఆహార పదార్ధాలను తీసుకోవాలని తెలియజేయాలన్నారు. సమావేశంలో కేఆర్‌ఆర్‌ఎస్‌డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.
సెంచూరియన్‌తో ఎంఆర్ కళాశాల ఎంఓయూ
నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయం విజయనగరం మహారాజా కళాశాలతో సోమవారం ఎంఓయూ కుదుర్చుకుంది. కళాశాల ప్రినిపాల్ డాక్టర్ సాంబశివరావు, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ..నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధన, నైపుణ్యం, తదితర అవకాశాలకు ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో డీన్లు డాక్టర్ సన్నీడయోల్, డాక్టర్ విజయ్‌బాబు, పుష్పలత, ఐక్యూసీ హెడ్ ప్రొఫెసర్ ఎంఎంల్‌ఎన్ ఆచార్యులు, తదితరులు పాల్గొన్నారు.
బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారుల సత్తా
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 11,12 తేదీల్లో విశాఖపట్నంలోని జరిగిన డీఅర్‌ఎం కప్ 8వ రాష్ట్రస్థాయి ఉమెన్‌న్స్ సీనియర్ బాక్సింగ్ చాంపంయన్ షిప్ 2025లో విజయనగరం క్రీడాకారులు మూడు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలు గెలుపొందారు. విజేతల్లో ఎస్. షర్మిల 70 కిలోల రజత పతకం, మనోజి 75 కిలోల విభాగంలో రజత పతకం, సుమిత్ర 80 కిలోల కేటగిరిలో రజత పతకం, ఎన్.రమ్య 57 కిలోల కేటగిరిలో కాంస్య పతకం, బి.పూజిత 65 కిలో కేటగిరిలో కాంస్య పతకం, 60 కిలోల విభాగంలో వై.అనుష కాంస్య పతకం దక్కించుకున్నారు. విజేతలను స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతి రాజు అభినందించారు.
100 లీటర్ల సారా స్వాధీనం●
● ఇద్దరిపై కేసు నమోదు
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఇరిడి, పులిగూడ గ్రామాల్లో సారా అమ్మకాలపై సోమవారం నిర్వహించిన దాడుల్లో భాగంగా సారాను స్వాధీనం చేసుకోవడంతో పాటు సారాను కలిగి ఉన్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఇరిడి గ్రామంలో బిడ్డిక గుండు 80 లీటర్ల సారాతో, పులిగూడ గ్రామానికి చెందిన ఊయక కిరణ్ కుమార్ 20 లీటర్ల సారాతో పట్టుబడ్డారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కురుపాం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో గల మండలాల్లో సారా తయారీ, విక్రయాలు, సరఫరా అరికట్టేందుకు దాడులు ముమ్మరంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు.
జీబీఎస్‌పై అప్రమత్తం
జీబీఎస్‌పై అప్రమత్తం
జీబీఎస్‌పై అప్రమత్తం
Comments
Please login to add a commentAdd a comment