ఆధునిక హంగులతో పార్వతీపురం రైల్వేస్టేషన్
పార్వతీపురంటౌన్: ఆధునిక హంగులతో పార్వతీపురం రైల్వేస్టేషన్‌ను నిర్మిస్తున్నామని ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర ఫంక్వాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అమృత్ భారత్ నూతన స్టేషన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రయాణికులకు కొద్ది రోజుల్లోనే అధునాతన రైల్వేస్టేషన్‌ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అమృత్ భారత్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నూతనంగా ఎఫ్‌ఓబీ, టికెట్ కౌంటర్, రిజర్వేషన్ కౌంటర్, వెయింటిగ్ హాల్ పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న స్టేషన్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. స్టేషన్ అభివృద్ధికి సిబ్బంది అంకితభావంతో పని చేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విశాఖ డీఆర్‌ఎం మనోజ్ కుమార్ సాహు, రాయగడ డీఆర్‌ఎం అమితాబ్ సింగల్, సీఏఓ అంకుస్ గుప్త, సీనియర్ డీసీఎం కె సాందీప్ తదితరులు పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల పర్యవేక్షణ
విజయనగరం టౌన్: ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ (భువనేశ్వర్) సోమవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. భువనేశ్వర్‌లో బయలుదేరిన ఆయన రాయగడ మీదుగా జిమిడిపేట, పార్వతీపురం, బొబ్బిలి, సీతానగరం మీదుగా రాత్రి 7 గంటల ప్రాంతంలో విజయనగరం రైల్వేస్టేషన్‌కు ప్రత్యేక రైల్లో చేరుకున్నారు. అడుగడుగునా ట్రాక్‌ల పరిశీలనతో పాటు మలుపులు, హెచ్చరికబోర్డులు, ట్రాక్ పాయింట్లు, ఆర్‌యూబీలు పర్యవేక్షి ంచారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు, రాజకీయనాయకులు, ప్రతినిధులు ఇచ్చిన వినతులను పరిశీలించారు. అమృత్‌భారత్ నిధుల్లో భాగంగా ప్రయాణికులకు ప్రత్యేక వసతుల కల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ మెడికల్ రూమ్‌ను ప్రారంభించారు. అమృత్‌భారత్ స్టేషన్ అభివృద్ధిపనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా చేపట్టాల్సిన పనులౖపై సూచనలు చేశారు.
అమృత్ భారత్ పనులు పరిశీలించిన రైల్వే జీఎం
ఆధునిక హంగులతో పార్వతీపురం రైల్వేస్టేషన్
Comments
Please login to add a commentAdd a comment