సీ్త్ర, పురుష నిష్పత్తిని తగ్గించాలి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో సీ్త్ర, పురుష నిష్పత్తిలో వ్యత్యాసం అధికంగా ఉంటున్నదని, దీనిని తగ్గించేందుకు గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి స్కానింగ్ కేంద్రాలపై గట్టి నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ బీఆర్. అంబేడ్కర్ అన్నారు. జిల్లాలో ఉన్న 110 స్కానింగ్ కేంద్రాల ద్వారా రోజువారీ జరుగుతున్న స్కానింగ్‌ల సమచారాన్ని సేకరించాలని సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం వైద్యాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. గర్భిణులకు అవసరం ఉన్నా లేకపోయినా సిజేరియన్ చికిత్సలకు వైద్యులు సిఫార్సు చేస్తూ పేద కుటుంబాలపై అనవసర ఆర్థికభారం మోపుతున్నారని, దీనిని నివారించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో నమోదైన గర్భిణులు, వారిలో జరుగుతున్న సాధారణ ప్రసవాలు, సిజేరియన్లు ఆయా నెలల్లో జరిగే అబార్షన్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు కూడా స్కానింగ్ సెంటర్స్‌ను తనిఖీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి, ఎన్‌సీడీ పీఓఓ డాక్టర్ సుబ్రమ్మణ్యం, డెమో వి.చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment