విజయనగరం అర్బన్: జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ)లో రెండు రోజులు నిర్వహించే జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ఏక్తార్ ఎక్స్‌ఎక్స్‌వీ’ అనే అంశంపై నిర్వహించిన ఈ సింపోజియంను యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథిగా హాజరైన ఎన్‌ఎస్‌టీఎల్–జి రిటైర్డ్ శాస్త్రవేత్త పి.త్రిమూర్తులు మాట్లాడుతూ రోజువారీ జీవితంలో విజయానికి విద్య, వృత్తి నైపుణ్యాలు ముఖ్యమన్నారు. ఉన్నత ఉద్యోగాలకు, పదవుల ఇంటర్వ్యూలకు హాజరయ్యే విద్యార్థులు ప్రాథమిక సూత్రాలపై దృష్టి సారించడం ఎంతో అవసరమని సూచించారు. అనంతరం విశిష్ట అతిథిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జి.జయసుమ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, పూర్వ విద్యార్థల సంబంధాల డైరెక్టర్ ప్రొఫెసర్ కె.శ్రీకుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీజేనాగరాజు, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ వీఎస్ వకుళ, ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్లు పి.శ్రీనివాసులురెడ్డి, టి.శిరీష, వివిధ కళాశాలల నుంచి హాజరైన 400 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment