శేష వాహనంపై స్వామి ఊరేగింపు
రాయగడ: కొలనార సమితి అమలాభట్ట సమీపంలో గల శ్రీక్షేత్ర టౌన్‌షిప్ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీలక్ష్మీనృసింహుని ఆలయ ప్రథమ వార్షికోత్సవంతో పాటు స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ప్రధాన ఘట్టమైన శేషవాహనంపై స్వామి ఊరేగింపు కనుల పండువగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు మంగనాథ్ ఆచార్యులు, ప్రముఖ వేద పండితులు భాస్కరాచార్యులు పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. ముందుగా ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన శేషవాహనంపై స్వామిని ఊరేగించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
సామూహిక వివాహాలు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ వారు మందిరం ప్రాంగణంలో సామూహిక వివాహాల కార్యక్రమాలను స్వామి కల్యాణోత్సవంతో పాటు కొనసాగించారు. ఐదుగురు దంపతులకు ఉచితంగా వివాహాలు చేశారు. ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్ దంపతులు పాల్గొని నవవధూవరులను అభినందించారు. అనంతరం స్థానిక వేంకటేశ్వర మందిరానికి చెందిన మహిళలు విష్ణు సహాస్రనామాలు పారాయణం చేశారు.
శేష వాహనంపై స్వామి ఊరేగింపు
శేష వాహనంపై స్వామి ఊరేగింపు
Comments
Please login to add a commentAdd a comment