బాలింకేశ్వర మందిరంలో పూజలు
రాయగడ: స్థానిక బాలింకేశ్వర మందిరంలో సోమవారం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. అత్యంత పురాతనమైన ఈ మందిరాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, దాతలు కలిసి అభివృద్ధి చేశారు. ఈ 24న పునప్రతిష్టాపనోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సోమవారం ముహూర్తపు పూజలు నిర్వహించారు. తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి, గంజాం పండితులు నీలమాధవ త్రిపాఠి, పట్టణ ప్రముఖులు, మందిర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అటవీ భూమి పట్టాల
పంపిణీ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి కంబేఢ పంచాయతీలో సోమవారం అటవీ భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తొలిరోజు కాంబేఢ, పాత చిమాటాపల్లి పోట్రేల్ పంచాయతీలకు చెందిన వారికి పట్టాలు అందజేశారు. ప్రభుత్వం తరఫున ముందుగా ఏడు గ్రామాలకు అందజేశారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క గిరిజనుడికి పట్టాలు అందజేస్తామని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్ తెలిపారు. కార్యక్రమంలో కాంబేడ సర్పంచ్ రమాకాంత్ మడ్కమి, డుడుమేట్ల సర్పంచ్ ముఖుందో సోడి, ప్రోట్రేల్ సర్పంచ్ పూజ పడియామి, పారెస్టర్ మోహన్ గుడియా తదితరులు పాల్గొన్నారు.
రాయగడ జిల్లా బీజేపీ
అధ్యక్షుడిగా గోపి ఆనంద్
రాయగడ: జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా న్యాయవాది గోపి ఆనంద్ నియమితులయ్యారు. మొత్తం 13 మంది ఆశావహులు తమ దరఖాస్తులను ఎన్నికల అధికారిగా వ్యవహరించిన దేవేంద్ర మహంతికి సమర్పించగా.. పార్టీ అధిష్టానం గోపి ఆనంద్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ఇటీవల 30 జిల్లాలకు గాను 23 జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన అధిష్టానం ఏడు జిల్లాలను పెండింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. ఇందులో రాయగడ ఒకటి. ఎట్టకేలకు గోపి ఆనంద్‌కు పదవి వరించడంతో మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శబరి కల్చరల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం
కొరాపుట్: అవిభక్త కొరాపుట్ జిల్లాల సంస్కృతిని పరిరక్షించేందుకు ఏర్పాటైన శబరి కల్చరల్ కౌన్సిల్ సర్వసభ్య సోమవారం సమావేశం జరిగింది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో సాహిద్ లక్ష్మణ్ నాయక్ భవన్‌లో రాష్ట్ర గిరిజన సంక్షేమ,విద్యా శాఖా మంత్రి నిత్యానంద గొండో అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అక్కడ నూతనంగా నిర్మించిన గెస్ట్ హౌస్‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మజ్జి చేతుల మీదుగా ప్రారంభించాలని సమావేశం ఆమోదించింది. ముఖ్యమంత్రికి అనుకూలమైన తేదీ కోసం మాట్లాడడానికి అవిభక్త కొరాపుట్ జిల్లాలకు చెందిన ఎంపీలు,ఎంఎల్‌ఎలు అందరం కలసి వెళ్లి ఆహ్వానిద్దామని జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహీణీపతి సూచించారు. 1970 లో అవిభక్త కొరాపుట్ జిల్లాల వారి కోసం రాష్ట్ర రాజధాని లో ఈ సంస్థ ఏర్పాటైంది. సమావేశంలో ఎమ్మెల్యేలు గౌరీ శంకర్ మజ్జి (నబరంగ్‌పూర్), రఘరాం మచ్చో (కొరాపుట్), రుపుధర్ బోత్ర (కొట్ పాడ్), భ్రుగు భక్షి పాత్రో, గోదావరిష్ మహాపాత్రో, సత్య ప్రియ దాస్, మానస్ త్రిపాఠి, బంక బీహారి బిసోయి, నీలో దాస్ తదితరులు పాల్గొన్నారు.
బాలింకేశ్వర మందిరంలో పూజలు
బాలింకేశ్వర మందిరంలో పూజలు
Comments
Please login to add a commentAdd a comment