ఆటో–టిప్పర్ ఢీ
జయపురం: జయపురం సమితి టంకువ పంచాయతీ ధనముండ 326 విజయవాడ– రాంచీ జాతీయ రహదారిలో వంతెన సమీపంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రయాణికుల ఆటోను టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అంబులెన్స్‌లో కొరాపుట్‌లోని సహిద్ లక్ష్మణ నాయిక్ ఆస్పత్రికి తరలించారు. మరో ఐదుగురిని కొరాపుట్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఆటోలో వస్తున్న వారంతా శ్రామికులు. వారు ప్రతి రోజూ బొయిపరిగుడ సమితి లెంజ గ్రామం నుంచి కూలి పనుల కోసం జయపురం వస్తుంటారు. సోమవారం కూడా అలాగే వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే జయపురం సదర్ పోలీసు అధికారి ఈశ్వర చంద్ర తండి పోలీసు సిబ్బందితో సంఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన బొయిపరిగుడ సమితి లెంజ గ్రామ ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంతం అంతా ఏడుపులతో ప్రతిధ్వనించింది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిలో ట్రాఫిక్ ఆగపోయింది. పోలీసులు వచ్చి రోడ్డు క్లియర్ చేశారు.
ఇద్దరు దుర్మరణం
మరికొందరికి గాయాలు
ఆటో–టిప్పర్ ఢీ
ఆటో–టిప్పర్ ఢీ
ఆటో–టిప్పర్ ఢీ
Comments
Please login to add a commentAdd a comment