అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ఏర్పాట్లు
జయపురం: రానున్న వేసవిలో జయపురం అటవీ డివిజన్‌లో అగ్ని ప్రమాదాల నుంచి అడవులను సంరక్షించేందుకు, గ్రామీణ ప్రజలను చైతన్య పరిచేందుకు అటవీ విభాగ అధికారులు సచేతన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అగ్ని ప్రమాదాలు నివారించేందుకు నూతన పద్ధతిని ప్రారంభిస్తున్నట్లు అటవీ అధికారులు వెల్లడించారు. అడ వుల్లో అగ్ని ప్రమాదాలు మానవ తప్పిదాలని జయపురం అటవీ రేంజర్ సచ్చిదానంద పొరిడ అన్నారు. ముఖ్యంగా పోడు వ్యవసాయం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని అన్నారు. సోమవారం జయపురం సమితి మహుళభ గ్రామంలో అటవీ విభాగం నిర్వహించిన సచేతన కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అగ్ని ప్రమాదాల నుంచి అడవులను రక్షించేందుకు నూతన ప్రక్రియ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ప్రతి సంరక్షిత, ప్రతిపాదిత సంరక్షిత, గ్రామాలకు చేరువలో ఉన్న అడవుల్లో అగ్ని నిరోధక మంచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జయపురం రేంజ్‌లో ప్రయోగాత్మకంగా ఘాట్‌ఘుమర్, పాత్రోపుట్, మహుళభట్‌లలో అగ్ని నిరోధక మంచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి గ్రామంలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు జయపురం రేంజ్‌లో 30 మందితో రెండు టీమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వేసవి కాలం 3 నెలలలో 10 మంది ఉద్యోగులను వి.ఎస్.ఎస్ లుగా నియమిస్తామన్నారు. ప్రతి అగ్ని నిరోదక మంచ్‌లో ముగ్గురు చొప్పున గార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వారు ప్రతి క్షణం మంచ్ పరిధిలో అడవులపై దృష్టి సారిస్తారని వెల్లడించారు. ఈ మంచ్‌ల ఫలితాలు పరిగణనలోకి తీసుకుని అగ్ని నిరోధక మంచ్‌లను విస్తరింపజేయనునట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment