సారా ధ్వంసం
జయపురం: నాటు సారా అక్రమంగా రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని జయపురం అబ్కారి సిబ్బంది అరెస్టు చేశారు. అరెస్టు అయిన వ్యక్తి జయపురం సమితి పుస్‌పురి గ్రామానికి చెందిన కుమ హరిజన్(46) అని అబ్కారి అధికారి సుబ్రత్ కేశర హిరన్ సోమవారం వెల్లడించారు. జయపురం సదర్ పోలీసులు, అబ్కారి సెట్‌లైట్ యూనిట్, అబ్కారి విభాగ సిబ్బంది కలిసి రూ.90 వేల విలువ చేసిన సారా ధ్వంసం చేసినట్లు తెలిపారు. సదర్ పోలీసులు, అబ్కారి సెట్‌లైట్ యూనిట్, అబ్కారి విభాగ సిబ్బంది సంయుక్తంగా పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జయపురం సమితి కొలాగుడ సమీప అడవిలో అక్రమంగా సారా బట్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. సారా బట్టీలపై దాడి చేశారు. ఆ ప్రాంతంలో 4 బట్టీల్లో 60 లీటర్ల నాటు సారా, సారా వంటకానికి సిద్ధం చేసి ఉంచిన 1300 లీటర్ల ఇప్ప ఊట ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. బట్టీల్లో సారా వంటకానికి వినియోగించే సామగ్రిని సీజ్ చేశారు. ఆ సమయంలో ఆ మార్గంలో సారా తీసుకువెళ్తున్న కుమ హరిజన్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడిలో జయపురం అబ్కారి అధికారి సుబ్రత్ కేశర హిరన్, ఏఎస్‌ఐ బలరాం దాస్, సెటలైట్ యూనిట్ ఏఎస్‌ఐ బ్రజకిశోర్ నాయక్, సదర్ పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ నరసింహ, ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment