పాండ్రీపాణి పంచాయతీలో భీమ బోయి కార్యక్రమం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మల్కన్‌గిరి సమితి పాండ్రీపాణి పంచాయతీ ఎస్‌ఎస్‌డీ ప్రాథమిక విద్యాలయ ప్రాంగణంలో సోమవారం సామాజిక భద్రత, దివ్యాంగుల చైతన్యం కోసం భీమబోయి శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మల్కన్‌గిరి సమితి అధ్యక్షుడు గౌరీ పోడియామి హాజరయ్యారు. ఈ సందర్భంగా 460 మంది దివ్యాంగుల యూడీఐడీ కార్డుల కోసం నమోదు చేసుకున్నారు. మరో 92 మంది హితాధికారులకు బస్సు పాస్, 44 మందికి డీఆర్‌ఎల్ లోన్, 133 మందికి పింఛన్లు, ఆరుగురికి వీల్‌చైర్లు, ఒక వికలాంగ జంటకు పెళ్లి కోసం రూ.2.5 లక్షలు అందజేశారు.
మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ
రాయగడ: మునిగుడలో రామకృష్ణ మిషన్ నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్రనాయక్ సోమవారం పరిశీలించారు. కుట్టుమిషన్‌లో శిక్షణ పొందుతున్న మహిళలను అభినందించారు. మహిళల ఆర్థిక సాధికారితకు శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం శిక్షణ పొందుతున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ జయరాం పంగికి పరామర్శ
కొరాపుట్: కొరాపుట్ మాజీ ఎంపీ, మాజీ మంత్రి జయరాం పంగిని కొరాపుట్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సస్మితా మెలక సోమవారం పరామర్శించారు. పంగి స్వస్థలం కొరాపట్ జిల్లా పొట్టంగి సమితి కుందిలిని సందర్శించారు. పంగి కూమార్తె రాజ్యలక్ష్మి పంగి ఎముకల క్యాన్సర్ బారి పడి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్మన్ పంగిని పరామర్శించి సానుభూతి తెలియజేశారు. పరామర్శలో మాజీ ఎంపీ జిన్ను హిక్కా, మాజీ ఎమ్మెల్యే రఘురాం పొడాల్ ఉన్నారు.
కొరాపుట్ బీజేపీ అధ్యక్షుడికి అభినందన
కొరాపుట్: బీజేపీ కొరాపుట్ జిల్లా నూతన అధ్యక్షుడు శివ ప్రసాద్ ముదలికి పలువురు అభినందనలు తెలియజేశారు. సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. ఆదివాసీ నేతగా బీజేపీ వర్గాల్లో పేరున్న శివప్రఽసాద్‌కి తొలిసారిగా ఈ పదవి రావడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధిష్టానం ప్రకటన వెలువడిన అనంతరం సోమవారం పార్టీ నాయకులు పూర్ణిమా, గౌతం సామంత్రాయ్ తదితరులు వెళ్లి అభినందనలు తెలిపారు.
నూతన కార్యవర్గం ఏర్పాటు
రాయగడ: రాష్ట్ర అమలా సంఘం రాయగడ శాఖకు సంబంధించి ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఫలితాలను ప్రకటించారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన అరుణ్ కుమార్ షడంగి ఈ మేరకు కొత్త కార్యవర్గం తుది ఫలితాలను వెల్లడించారు. సంఘం అధ్యక్షుడిగా మనోజ్ రొథొ, ఉపాధ్యక్షుడిగా నారాయణ పట్టజొషి, కార్యదర్శిగా అజయ్ నాహక్, సహ కార్యదర్శిగా బబితా పండా, కోశాధికారిగా గదాధర పాత్రోలు ఎన్నికై నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రెవెన్యూ విభాగానికి చెందిన 254 మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కొత్త కార్యవర్గం మూడేళ్లపాటు కొనసాగుతుంది.
పాండ్రీపాణి పంచాయతీలో భీమ బోయి కార్యక్రమం
పాండ్రీపాణి పంచాయతీలో భీమ బోయి కార్యక్రమం
పాండ్రీపాణి పంచాయతీలో భీమ బోయి కార్యక్రమం
పాండ్రీపాణి పంచాయతీలో భీమ బోయి కార్యక్రమం
Comments
Please login to add a commentAdd a comment