గ్రీవెన్స్‌సెల్‌కు వినతుల వెల్లువ
పర్లాకిమిడి: గజపతి జిల్లా నువాగడ సమితి కిరమా పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు వినతులు వెల్లువెత్తాయి. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర మింజ్, ఎస్పీ జితేంద్ర కుమార్ పండా, డీఆర్‌డీఏ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గుణనిధి నాయక్‌లు హాజరై 83 వినతులు స్వీకరించారు. అందులో 30 గ్రామసమస్యలు కాగా, 23 వ్యక్తిగతమైనవి. నాలుగు దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. ఒకరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం కిరమా పంచాయతీ కార్యాలయం ఆవరణలో మిషన్ శక్తి స్టాల్స్‌ను అధికారులు సందర్శించారు. కార్యక్రమంలో నువాగడ సమితి అధ్యక్షురాలు మాలతీ ప్రధాన్, ఐ.టి.డి.ఎ. అధికారి అంశుమాన్ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు.
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి కార్యాలయం సమావేశం మందిరంలో సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ను జిల్లా యంత్రాంగం నిర్వహించింది. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలొ ఎస్‌పీ శ్వాతి ఎస్ కుమార్, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ లాల్ మోహన్ రైత్రాయ్, డీఎఫ్‌వో అన్నా సాహెబ్ ఒహాలే, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండి తదితరులు పాల్గొన్నారు. మునిగుడ సమితి పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 59 మంది వినతులను అందజేశారు. వీటిలో 55 వ్యక్తిగత సమస్యలు కాగా మరోనాలుగు గ్రామసమస్యలుగా గుర్తించారు. అనంతరం సమస్యల పరిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకొవాలని అదనపు కలెక్టర్ నాయక్ ఆదేశించారు.
గ్రీవెన్స్‌సెల్‌కు వినతుల వెల్లువ
గ్రీవెన్స్‌సెల్‌కు వినతుల వెల్లువ
Comments
Please login to add a commentAdd a comment