రైల్వే ప్రయాణికుల భద్రతపై అధికారుల దృష్టి
● రాయగడలో పర్యటించిన తూర్పుకోస్తా రైల్వే జీఎం
రాయగడ: రైల్వే ప్రయాణికుల భద్రతపై సంబంధిత అధికారుల దృష్టిసారించారు. ఇందుల ో భాగంగా తూర్పుకోస్తా రైల్వే జనరల్ మేనేజరు పరమేశ్వర్ ఫంక్వాల్ సొమవారం రాయగడలో పర్యటించారు. ఆయన వెంట రాయగడ డీఆర్‌ఎం అమితాబ్ సింఘాల్, విశాఖపట్నం డీఆర్‌ఎం మనోజ్ కుమార్ సాహు ఇతర అధికారులు ఉన్నారు. రాయగడ–విజయనగరం రైల్ మార్గంలో మధ్య భద్రత చర్యలపై సంబంధిత శాఖ అధికారులతో జీఎం ఫంక్వాల్ చర్చించారు. రాయగడలో కొనసాగుతున్న రైల్వే డివిజన్, కొత్తగా నిర్మించిన స్టేషన్ భవనాలు తదితరమైనవి పరిశీలించారు. అనంతరం స్థానిక రైల్వే కాలనీలో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కాలనీలో పిల్లల వినోదం కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఉద్యానవనాన్ని కూడా అధికారులు పరిశీలించారు. పిల్లలతో కాసేపు ముచ్చటించారు. కాలనీలో పరిశుభ్రత ఎల్లవేళలా పాటించాలని సూచించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజనల్ మేనేజర్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
రైల్వే ప్రయాణికుల భద్రతపై అధికారుల దృష్టి
Comments
Please login to add a commentAdd a comment